వేసవి కాలం వచ్చేసింది.ఎండలు మండిపోతున్నాయి.
ఉదయం పది గంటలు దాటిందంటే చాలు ప్రజలు బయట కాలు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు.అయితే వేసవి కాలంలో తీవ్రంగా వేధించే సమస్యల్లో చెమటకాయలు ఒకటి.
ఎండల్లో ఎక్కువగా తిరగడం కారణంగా చర్మంపై చిన్న చిన్న మొటిమలు వస్తుంటాయి.వీటినే చెమటకాయలు అని అంటారు.
దాంతో ఈ చెమటకాయలను నివారించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు.ఖరీదైన పౌడర్లు, నూనెలు వాడుతుంటారు.
అయితే వచ్చాక బాధ పడటం కంటే.రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో మంచిది.మరి ఇంకెందుకు ఆలస్యం చెమటకాయలు రాకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండీ.చెమటకాయలకు దూరంగా ఉండాలంటే.
చర్మాన్ని తాజాగా ఉంచుకోవడం ఎంతో అవసరం.కాబట్టి.
ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.కెమికల్స్ తక్కువగా ఉండే సబ్బులనే వాడాలి.

బాడీ డీహైడ్రేట్ అయిపోయినా చెమటకాయలు వస్తుంటాయి.అందు వల్ల, శరీరానికి సరిపడా నీటిని అందించాలి.ఒంటికి పట్టినట్లుగా ఉండే దుస్తులను ధరిస్తే.చెమటలు బాగా పట్టేస్తుంటాయి.ఫలితంగా చెమటకాయలు వస్తాయి.కాబట్టి, వదలుగా ఉండే కాటన్ దుస్తులనే వేసుకోవాలి.
పడుకునే గదిలో చల్లగా, బాగా గాలి ఆడేలా వెంటిలేషన్ ఉంచుకోవాలి.మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్లీ నీళ్లు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలి.
మరియు ఎండల్లో తిరగడం తగ్గించాలి.

ఒకవేళ మీకు చెమటకాయలు ఉంటే.వాటిని నివారించడానికి బ్లాక్ టీ సూపర్‌గా సహాయపడుతుంది.బ్లాక్ టీని చెమటకాయలపై దూది సాయంతో అప్లై చేసుకోవాలి.
ఇలా తరచూ చేస్తే చెమటకాయలు క్రమంగా తగ్గిపోతాయి.లేదా కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్‌ను చెమటకాయలపై పూసి బాగా ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా చెమటకాయల నుంచి ఉపశమనం పొందొచ్చు.