2024 ఏపీ ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు.టీడీపీ…బీజేపీ కలయిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.మొదటినుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని.
చెబుతూనే.కూటమి ఏర్పాటు చేయగలిగారు.
ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ విమర్శలు చేయడం జరిగింది.కూటమి ఏర్పాటు కావడానికి గల కారణాలను కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వివరించడం జరిగింది.
ఈ ఎన్నికలలో పిఠాపురం( Pithapuram ) నుండి ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.
ఇదిలా ఉంటే మే 13వ తారీకు ఏపీలో పోలింగ్ ముగిసింది.
ఊహించని విధంగా గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది.మొత్తం 81.86% నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో నమోదైన పోలింగ్ శాతంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్నికలలో ప్రజలు తమపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఓటింగ్ లో భాగమైనందుకు అభినందనలు తెలిపారు.రాష్ట్రంలో 81.86% పోలింగ్ నమోదు కావడం ఆనందాన్ని కలిగించిందన్నారు.ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈసీ, ఇతర అధికారులు చేపట్టిన చర్యలను ప్రశంసించారు.