ప్రభాస్ రాజమౌళి( Chatrapathi ) కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఛత్రపతి కాగా ఈ సినిమా ఈ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.ప్రభాస్ కు మాస్ ఫ్యాన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఈ సినిమా కారణమనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో సూరీడు తన తల్లికి బ్రేక్ ఫాస్ట్ తినిపిస్తూ ఉంటాడు.
ఆ సమయంలో ప్రభాస్ పాత్ర( Prabhas)కు చిన్నప్పుడు తన తల్లి తినిపించిన రోజులు గుర్తుకు వస్తాయి.అదే సమయంలో తల్లికి పూరీ తినిపిస్తున్న కొడుకును చూసి ప్రభాస్ సంతోషిస్తాడు.ఒకే సీన్ లో ప్రభాస్ ఇలా రెండు ఎక్స్ ప్రెషన్లను పలికిస్తాడు.జక్కన్నకు మాత్రం ఈ సీన్ ఎంతగానో నచ్చిందని సమాచారం అందుతోంది.ఛత్రపతి తర్వాత ఈ కాంబినేషన్ లో బాహుబలి, బాహుబలి2 తెరకెక్కి ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.
ప్రభాస్ జక్కన్న కాంబినేషన్ ను ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రావడం సాధ్యమవుతుందో లేదో తెలియాల్సి ఉంది.ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలలో ఒకరిగా ఉన్నారు.ప్రభాస్ సినిమాలు బాహుబలి2 తర్వాత హిట్టవుతున్నా బాహుబలి2 రేంజ్ లో మాత్రం హిట్ కావడం లేదనే సంగతి తెలిసిందే.బాహుబలి2 ( Baahubali 2 )సినిమాను అప్పట్లోనే థియేటర్లలో 10 కోట్ల మంది చూశారు.ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడం ఇప్పట్లో ఏ సినిమాకు సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ వరుస విజయాలను అందుకుని నెక్స్ట్ లెవెల్ కు ఎదిగి హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రాజమౌళి సైతం కెరీర్ పరంగా ప్రస్తుతం ఊహించని స్థాయిలో ఉన్నారు.
ఈ స్థాయి వల్ల ఆయన క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.