హీరో రానా భార్య తల్లి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం.. మిహికా ఏమన్నారంటే?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వస్తున్నాయి.సెలబ్రిటీ జోడీలలో కొన్ని జోడీలు విడిపోతున్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ మధ్య కాలంలో రానా భార్య మిహికా గర్భవతి అని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.

 Rana Daggubati Wife Miheek Clarity Pregnancy Rumours Details Here , Interesting-TeluguStop.com

ఏడాదిన్నర క్రితం రానా మిహికా వివాహం గ్రాండ్ గా జరిగింది.పెళ్లి తర్వాత రానా మిహికా అన్యోన్యంగా ఉన్నారు.

రానా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ సాధించడంతో రానా ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

రానా భార్య మిహికా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలను, ఇతర విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు.తాజాగా రానా భార్య మిహికా ఒక పెళ్లికి హాజరై ఆ పెళ్లిలో తెగ సందడి చేశారు.

Telugu Bhimla Nayak, Miheeka Bajaj, Miheeka, Rana Daggubati, Virataparvam-Movie

మిహికా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.అయితే షేర్ చేసిన ఫోటోలలో మిహికా కొంచెం బొద్దుగా కనిపించారు.మిహికా అలా కనిపించడంతో కొందరు నెటిజన్లు మిహికాను మీరు గర్భవతా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నను క్యూరియాసిటీతో అడుగుతున్నామని నెటిజన్లు కామెంట్ చేశారు.అయితే నెటిజన్ల ప్రశ్నకు మిహికా కూల్ గానే జవాబు ఇచ్చారు.తాను గర్భవతి కాదని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Bhimla Nayak, Miheeka Bajaj, Miheeka, Rana Daggubati, Virataparvam-Movie

మ్యారేజ్ వెయిట్ అంటూ తాను బొద్దుగా కనిపించడానికి గల కారణాలను మిహికా వెల్లడించారు.మిహికా రానా ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ జోడీ చాలా అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.రానా ప్రస్తుతం విరాటపర్వం సినిమాతో పాటు పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.విరాటపర్వం మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube