ఓటీటీలో పునీత్ జేమ్స్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆయన మరణానంతరం ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్.

 Puneeth Raj Kumar James Movie Ott Streaming Details, Puneet Rajkumar, Kollywood-TeluguStop.com

ఈ సినిమా ఈయన పుట్టిన రోజు సందర్భంగా గత నెల థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇక పునీత్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.

చేతన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పునీత్ సోదరులు రాఘవేంద్ర రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.పునీత్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది.

థియేటర్ లో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని సోనీ లైవ్ లో ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నారు.

Telugu Anu Prabhakar, James, James Ott, Kollywood, Mukesh Rishi, Puneet Rajkumar

ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి రానుంది.కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ కీలక పాత్రలో నటించారు.శ్రీకాంత్ మేక, అను ప్రభాకర్, ముఖేష్ రిషి కీలక పాత్రలలో నటించారు.థియేటర్ లో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube