Pregnant Women Winter : చలికాలంలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది.ఈ సీజన్లో ఎవరికైనా రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది.

 Do You Know What Kind Of Food Is Good For The Health Of Pregnant Women In Winter-TeluguStop.com

దీనివల్ల ఎక్కువగా దగ్గు జలుబు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అదే విషయం గర్భిణి స్త్రీల విషయానికి వస్తే ఈ సమయంలో వారు చాలా సున్నితంగా ఉంటారు.

గర్భంతో ఉన్న ఆడవారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇలా గర్భంతో ఉన్నవారు ఏది పడితే అది అస్సలు తినకూడదు.

బయటి తినుబండారాలకు పూర్తిగా దూరంగా ఉండటమే మంచిది.గర్భిణీ లు పోషకాహార లోపం ఎదుర్కొంటే పుట్టబోయే బిడ్డలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది.

నవజాత శిశువులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఇది చలికాలం కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.

చలికాలంలో గర్భిణీలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.బత్తాయి, నారింజ, ఆపిల్, అరటీ తో పాటు విటమిన్ సి కలిగి ఉన్న తాజా పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది.

అంతేకాకుండా పాలకూర, బచ్చలి కూర, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు ఆకుకూరలు తినడం చలికాలంలో ఎంతో ప్రయోజనకరం.థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఆలుగడ్డను తినడం అస్సలు మంచిది కాదు.

Telugu Cabbage, Cauliflower, Kind Pregnant, Eggs, Tips, Potato, Seafood-Telugu H

అయోడిన్ సరైన పరిమాణంలో తీసుకోవడం గుడ్లు, సముద్రపు ఆహారాలు మొదలైనవి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం మంచిది.ఇంకా చెప్పాలంటే ఉప్పు మోతాదు పెరగకుండా చూసుకోవడం మంచిది.ఎముకలు బలంగా ఉండడానికి కాల్షియం అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టి బ్రోకలి, కాలే వంటి ఎన్నో రకాల ఎక్కువగా పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.

అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి.అందులో పప్పులు, తృణధాన్యాలు క్రమం తప్పకుండా తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube