గులాబీ శిబిరంలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ నేతలు అనే విధంగా అంతర్గత వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.ఈ తరుణంలో గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో నియోజకవర్గ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న పార్టీ నేత,ఎన్ఆర్ఐ జలగం సుధీర్ పై పార్టీ అధిష్టానం ఫోకస్ చేసినట్లు కోదాడ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రాష్ట్ర మంత్రి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లగా ముందుగానే అమెరికా చేరుకున్న జలగం పార్టీ ( Jalagam party )కోసం మొదటి నుండి పని చేస్తూ, ఫండింగ్చే స్తున్న సహచర ఎన్ఆర్ఐలతో కలిసి కేటీఆర్ కు కోదాడలో నెలకొన్న పార్టీ అంతర్గత పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది.పనిలో పనిగా కోదాడ నుండి గతంలోనే టికెట్ ఆశించినా చివరి నిమిషంలో పార్టీ పెద్దల సూచనతో తప్పుకున్నట్లు, ఈ సారి తప్పకుండా అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం.
దీనికి మంత్రి కేటీఆర్( KTR ) కూడా సానుకూలంగా స్పందించినట్లు, తప్పకుండా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చినట్లు జలగం తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్లు వినికిడి.అమెరికా నుంచే కోదాడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై అధికారులతో ఎప్పటికప్పుడు స్పందిస్తూ, రాష్ట్ర నాయకులతో మాట్లాడుతూ సమస్యలపై గళమెత్తుతున్న జలగం నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కోదాడ అధికార పార్టీలోని లుకలుకలతో పాటు అవినీతి ఆరోపణలు వెల్లువత్తుతున్న తరుణంలో సరైన అభ్యర్థి కొరకు అధిష్టానం వెతుకులాడుతున్న సమయంలో రాజకీయ వివాదరహితుడు,కేటీఆర్ కు అత్యంత సన్నితులలో ఒకరైన జలగం సుధీర్ కు ఖచ్చితంగా ఈ దఫా టికెట్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.దీనిపై జలగం సుధీర్ ను తెలుగు స్టాఫ్.
కామ్ పలకరించగా తనకు మంత్రి కేటీఆర్ పై పూర్తి విశ్వాసం ఉందన్నారు.పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే తన అభిలాష ఆయనకు తెలుసునని,రాజకీయాలకు కొత్త అర్దం చెప్పేందుకే ఖండాలు దాటి వస్తున్నానని,పురిటిగడ్డ అభివృద్ధి కోసం నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు.
తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రజలకు సేవకుడిగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చానని,యువత రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు.