సూర్యాపేట జిల్లా:జిల్లాలో కబడ్డీ క్రీడాకారుల అభివృద్ధికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కృషి చేస్తుందని కబడ్డీ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా చైర్మన్ మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం స్థానిక సాయి బృందావన్లో ఏర్పాటు చేసిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పాత,కొత్త రెండు కబడ్డీ అసోసియేషన్ లు ఉండడంతో క్రీడాకారులు అయోమయంలో ఉన్నందున దేవరం రవీందర్ రెడ్డి, ఆదిరెడ్డిల నిర్వహణలోని కొత్త అసోసియేషన్ జగదీష్ యాదవ్,కాసాని జ్ఞానేశ్వర్ ల అసోసియేషన్లో విలీనం కావడం జరిగిందని అన్నారు.తామంతా కలిసికట్టుగా ఉంటూ సూర్యాపేట జిల్లాలో కబడ్డీ క్రీడా బలోపేతానికి, క్రీడాకారులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
త్వరలో కబడ్డీ క్రీడాకారులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.అలాగే తామంతా కబడ్డీ క్రీడాకారుల కోసం ట్రస్టును ఏర్పాటు చేసి, వారికి చికిత్స,పేద క్రీడాకారులకు చేయుతను అందించనున్నట్లు వివరించారు.
కబడ్డీ క్రీడల్లో యాభై వేల పైన ప్రైజ్ మనీకి మాత్రమే అసోసియేషన్లో ఫీజు చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,ఒలింపిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో కబడ్డీ క్రీడను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్మినెంట్ స్టేడియం ఏర్పాటు చేయడంతో పాటు కబడ్డీ క్రీడాకారులు అందరినీ కలుపుకుని ఉమ్మడి కుటుంబంలా ముందుకు సాగుతామన్నారు.అలాగే అసోసియేషన్ కు వ్యతిరేకంగా పనిచేసిన మాతంగి సైదులు, తుర్క రమేష్ లకు ఆసోసియేషన్ తరపున షోకాజ్ జారీ చేసినట్లు ప్రకటించారు.
అనంతరం పాత అసోసియేషన్ లో విలీనమైన కొత్త అసోసియేషన్ నిర్వాహకులు దేవరం రవీందర్ రెడ్డి,ఆదిరెడ్డి బృందాన్ని ఘనంగా స్వాగతించారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రాంచందర్ గౌడ్,ఉపాధ్యక్షుడు లాల్ మదర్, వెంకటేశ్వర్లు,ఇమామ్,శివనాథ్ రెడ్డి,టి.
రాములు,బాగ్దాద్, గడ్డం వెంకటేశ్వర్లు,సునీల్ కుమార్,శ్రీనివాస్ నాయుడు, మహమ్మద్,వెంకట్ రెడ్డి,లక్ష్మీనారాయణ,కోటి,ప్రమీల, రఫీ,గాజుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.