సూర్యాపేట జిల్లా:మోసగాళ్ళు పాత పద్దతులకు పాతర పెట్టి ప్రజలు ఊహించని రీతిలో ఎప్పటికప్పుడు అదునూతన పద్దతులను అనుసరించుకుంటూ అమాయక ప్రజలను మోసం చేస్తూనేవున్నారు.అదే తరహాలో సూర్యాపేట పట్టణానికి చెందిన అనుములపురి వెంకటేశ్వర్లు అనే ఓ ప్రైవేటు టీచర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.గురువారం మధ్యాహ్నం స్థానిక హెడ్ పోస్టాపీస్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి టూ వీలర్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సడన్ గా సదరు వ్యక్తి ముందు బైక్ స్కిడ్ ఐనట్లుగా క్రింద పడిపోయాడు,తక్షణమే మరొక వ్యక్తి వచ్చి బాబాయ్ క్రిందపడిన బైక్ వ్యక్తిని ఇద్దరం కలిసి పైకి లేపి హెల్ప్ చేద్దామని అనగా సరే అని ఇద్దరూ కలసి బైక్ వ్యక్తిని నిలబెట్టే క్రమంలో వెంకటేశ్వర్లు జేబులో ఉన్నటువంటి రూ.18,000 విలువగల స్మార్ట్ ఫోన్ ను లాక్కొని ఇద్దరు కలసి బైక్ పై ఉడాయించారు.అవాక్కైన బాధితుడు వెంకటేశ్వర్లు లబోదిబోమంటూ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.ఇలాంటి వినూత్న రీతిలో దొంగతనాలకు పాల్పడుతున్న వారి వల్ల ఎదుటి వారికి సహాయం చేయాలనే ఆలోచన కూడా చచ్చిపోయే ప్రమాదం ఉందని పలువురు సిటీజన్లు వాపోతున్నారు.




Latest Suryapet News