సూర్యాపేట జిల్లా:జిల్లాలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతూ,చెరువులు మత్తడి దుంకుతున్నాయి.లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా,అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
శనివారం మునగాల మండలంలోని తాడువాయి గురప్ప వాగు ఉధృతిని అంచనా వేయకుండా దాటే ప్రయత్నం చేసిన తాడ్వాయి గ్రామానికి చెందిన షేక్ సైదులు (33)తండ్రి సాయిబెల్లి వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు.అతనిని కాపాడటానికి స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
షేక్ సైదులు ఓ పెట్రోల్ బంక్ లో పని చేస్తాడని తెలుస్తోంది.విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.







