సూర్యాపేట జిల్లా:మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పెన్ పహాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యూగేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాధాకృష్ణ, కట్ల నాగార్జున,దాసరి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.