సూర్యాపేట జిల్లా: ఎంతో భవిష్యత్ ఉన్న బంగారు తల్లుల మరణాలు ఎంతో బాధాకరమని బహుజన్ సమాజ్ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆయన మాట్లాడుతూ గత రెండు వారాల్లో నలుగురు సోషల్ వెల్ఫెర్ విద్యార్థినిలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని,చిన్నారులకు బంగారు భవిష్యత్తు ఉందని అన్నారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి వద్దే వెల్ఫెర్ అండ్ విద్యాశాఖ ఉందని,
సోషల్ వెల్ఫెర్ హాస్టల్లను ఎందుకు సందర్శించట్లేదని మండిపడ్డారు.
ఓ వైపు విధ్యార్థులు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మేథావులు,ప్రజా సంఘాలు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు.ప్రభుత్వం పట్టిపట్టనట్టు ఉంటే,త్వరలోనే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చూస్తారని విమర్శించారు.
వెంటనే సంక్షేమ హాస్టల్ల పట్ల ప్రత్యేక దృష్టి సాధించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు జీలకర రామస్వామి, అమరవరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.