ఆగస్టు 14 అర్థరాత్రి వరకు జరిగే జన జాగరణ జయప్రదం చేయండి: ప్రజా సంఘాలు పిలుపు

సూర్యాపేట జిల్లా: ఆగస్టు 14న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు జరిగే జన జాగరణను కార్మికులు, రైతులు,వ్యవసాయ కూలీలు,ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు,తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బరితెగించి కార్మిక,ప్రజా,రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు.

 Make Jana Jagarana A Successful To Be Held Till Midnight On August 14 Citu, Jana-TeluguStop.com

ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.డిజిల్, పెట్రోల్,గ్యాస్,నిత్యవసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని, పార్లమెంటులో రైతు వ్యతిరేక 3 చట్టాలను తీసుకొచ్చి నిరంకుశంగా ఆమోదింప చేసినప్పటికీ కార్మిక,కర్షక ఐక్య ఉద్యమాలతో వెనక్కి తీసుకోక తప్పలేదన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య చీలికలు తెచ్చిందని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతాంగానికి కనీసం మద్దతు ధర చట్టం, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని,కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,

కనీస వేతనాల చట్టాన్ని సవరించి కనీస వేతనం 26000 నిర్ణయించి అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించాలన్నారు.విదేశీ కార్పొరేట్లకు 5 శాతం పన్ను రాయితీ విరమించాలని కోరారు.వ్యవసాయ బడ్జెట్ రైతులకు అనుకూలంగా సవరించాలన్నారు.వ్యవసాయ పరిశోధనలకు అమెజాన్,సిస్టెంట,బేయర్ తో,ఐసిఏఆర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎం.ఎస్.పి చట్టం చేయాలని,స్వామినాథన్ కమిషన్సిఫారసులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు కోడి ఎల్లయ్య పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube