హై-పేయింగ్ జాబ్ వదిలిపెట్టిన ఐరిష్ మహిళ.. ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే షాకే..?

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.అందుకోసం మంచి ఉద్యోగం సంపాదించాలని ఇల్లు కట్టుకోవాలని ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని అనుకుంటారు.

 Ireland Woman Left Bank Job Home Shift Australia Work In Grapes Farm Details, Ir-TeluguStop.com

కొంతమందికి డబ్బు కంటే సంతోషంగా జీవించడం, కొత్త అనుభవాలు పొందడం ఎక్కువ ఇష్టం.అలాంటి కోవలోకే ఒక ఐరిష్ మహిళ వస్తోంది.

ఆమె బ్యాంకులో( Bank ) మంచి ఉద్యోగం చేస్తూ, అద్భుతమైన ఇల్లు కొనుగోలు చేసింది.కానీ ఇప్పుడు ఆమె అన్నింటినీ వదిలి పెట్టి, ఒక ఫామ్‌లో పని చేస్తోంది.

ఒక హాస్టల్‌లో ఉంటూ, వ్యవసాయ పనులు చేస్తూ తన జీవితాన్ని సాధారణంగా గడుపుతోంది.

వివరాల్లోకి వెళితే, కొలీన్ డీర్ (35)( Colleen Deere ) ఐర్లాండ్‌లోని కార్లో అనే చోట ఉండేది.

ఆమె ఒక బ్యాంకులో హై పేయింగ్ జాబ్( High Paying Job ) చేసేది.తన కుటుంబంతో కలిసి అక్కడే ఉండేది.కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత బ్యాంకులో పనిచేయడం మొదలుపెట్టింది.కానీ ఆమెకు 26 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

ఆస్ట్రేలియాకు( Australia ) వెళ్లాలని నిశ్చయించుకుంది.

Telugu Australia, Bank Job, Colleen Deere, Colleendeere, Grapes Farm, Job, Irela

కొలీన్ తన కుటుంబాన్ని వదిలి కొత్త జీవితం మొదలు పెట్టింది.ఆమె త్వరలో తిరిగి వస్తుందని అనుకున్నారు.ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు ఆమె దగ్గర సుమారు 3.8 లక్షల రూపాయలు ఉన్నాయి.2015 జనవరిలో ఆమె టూరిస్ట్ వీసాతో పర్త్‌కు వెళ్లింది.అక్కడ ఒక సంవత్సరం గడిపిన తర్వాత, 2016 ఫిబ్రవరిలో మరో వర్కింగ్ వీసా తీసుకొని పర్త్‌లోని ద్రాక్ష (వైన్) తోటల్లో( Grapes Farm ) పని చేయడం మొదలుపెట్టింది.అప్పటి వరకు ఆమె హాస్టల్‌లో ఉండేది.

కొన్ని వారాల తర్వాత హాస్టల్‌లో ఉండే టామ్ అనే యువకుడితో ప్రేమ పడింది.

Telugu Australia, Bank Job, Colleen Deere, Colleendeere, Grapes Farm, Job, Irela

టామ్ ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు.వాళ్లు హాస్టల్‌లో ఒకే గదిని షేర్ చేసేవారు.కొలీన్ ద్రాక్ష తోటల్లో పని చేసి వారానికి 27,000 రూపాయల వరకు సంపాదిస్తూ ఉండేది.

వాళ్ళిద్దరూ కలిసి హాస్టల్ రెంట్ కట్టేవారు.అది వారానికి సుమారు తొమ్మిది వేల రూపాయలు అవుతుంది.

టామ్ కూడా ద్రాక్ష తోటల్లో పని చేసేవాడు.అక్కడ పని చేసి తర్వాత వెంటనే హాస్టల్‌కు వచ్చేవాడు.

వాళ్లు ద్రాక్ష తోటల్లో పని చేసి కొంత డబ్బు చేసుకున్న తర్వాత బాలికి వెళ్ళారు.

Telugu Australia, Bank Job, Colleen Deere, Colleendeere, Grapes Farm, Job, Irela

బాలి నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు సిడ్నీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళకు తెలుసు.ఇద్దరూ కలిసి సిడ్నీకి( Sydney ) వెళ్లారు.

అక్కడ టామ్ కట్టడాల వర్కు సంపాదించగా, కొలీన్ రిక్రూట్‌మెంట్ అసిస్టెంట్ ట్రైనింగ్ జాబ్ చేసుకుంది.ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు సిడ్నీలోనే ఉండేవారు.

అక్కడే వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు.బాబుకు ఇప్పుడు ఒక ఏడాది.సిడ్నీలో రెండు గదుల బంగ్లాకు వాళ్లు వారానికి 41,000 రూపాయలు అద్దె కట్టేవారు.2023 డిసెంబర్‌లో వాళ్ళిద్దరూ ఆస్ట్రేలియా పౌరత్వం తీసుకున్నారు.వాళ్ళ బిడ్డ ఆస్ట్రేలియా పౌరుడుగా పుట్టాడు.కొలీన్ కొత్త సంస్కృతి, జీవన విధానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా వెళ్లింది.ఇప్పుడు ఆమె అక్కడి వాళ్ళలానే అయిపోయింది.

వార్తల ప్రకారం, వాళ్ళు త్వరలో పర్త్‌కు తిరిగి వెళ్తున్నారు.

అక్కడ ఖర్చులు తక్కువగా ఉంటాయి.అక్కడ నాలుగు గదుల ఇల్లు కొనడానికి వీలుంటుంది.

ఇద్దరూ ఇప్పుడు తమ జీవితంలో స్థిరపడ్డారు.ముందు కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.

కొత్త దేశంలో కొత్తగా మొదలు పెట్టాలంటే భయపడకుండా వెళ్లాలని కొలీన్ సలహా ఇచ్చింది.ఎందుకంటే తిరిగి రావడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుందని ఆమె చెప్పింది.

వీరి స్టోరీ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube