సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి.
ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.అయితే అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో వెంకటేష్( Venkatesh ) నటించిన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vastunnam ) సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇందులో భాగంగా బాలకృష్ణ ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ కార్యక్రమానికి( Unstoppable Show ) వెంకటేష్ హాజరయ్యారు.
ఇక ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆహాలో ప్రసారం అయింది.ఇకపోతే ఈ కార్యక్రమానికి వెంకటేష్ తో పాటు తన అన్నయ్య సురేష్ బాబు ( Suresh Babu ) కూడా హాజరయ్యారు.వీరితో బాలకృష్ణ ఎప్పటిలాగే సరదాగా ముచ్చటిస్తూ అప్పట్లో వీరి సినిమాలకు సంబంధించిన విషయాల గురించి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.ఈ క్రమంలోనే వెంకటేష్ లో ఉన్నటువంటి బలహీనత ఏంటి అంటూ బాలయ్య సురేష్ బాబును ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సురేష్ బాబు సమాధానం చెబుతూ… వెంకటేష్ తన వెనుక చేయి పెట్టుకొని గోకాడు అంటే ఇక ఆరోజు డైరెక్టర్లకు చుక్కలేనని సురేష్ బాబు తెలిపారు.సినిమా షూటింగ్ సమయంలో వెంకటేష్ తన చేయిని తల వెనక పెట్టుకొని గోకాడు అంటే ఆ సీన్ చేయటానికి తనకు చాలా కష్టమని అర్థం.ఇక ఆ సీన్ చేయటానికి డైరెక్టర్లు కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది.అలా ఏ సినిమాకైనా, ఏ సందర్భంలో అయినా చేసినా ఆ రోజు ఆ సీన్ ఇక తెగదు.
డైరెక్టర్లకి ఆ రోజు చుక్ ప్యాకప్ చెప్పుకోవాల్సిందే.ఇప్పటికీ ఆ బలహీనత తనలో ఉందని అయితే చాలా సినిమాల్లో ఆయన దాన్ని ఒక మ్యానరిజంగా చూపించడం విశేషం అంటూ వెంకటేష్ లో ఉన్నటువంటి బలహీనతను సురేష్ బాబు బయటపెట్టారు.