మారుతున్న జీవనశైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన అధిక ఒత్తిడి,నిద్రలేమి సమస్యలు వస్తాయి.ఈ సమస్యల కారణంగా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.
టమోటా
టమోటాలో ఉండే లైకోపీన్ అనే రసాయనం చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఒక స్పూన్ టమోటా రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల అయ్యాక శుభ్రం చేయాలి.
పుదీనా ఆకులు
తాజా పుదీనా ఆకులను తీసుకోని దానిలో కొంచెం నీటిని పోసి పేస్ట్ గా చేసుకోవాలి.
ఈ పేస్ట్ ని కంటి కింద ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
బాదాం గింజలు
పచ్చి పాలలో బాదాం గింజలను నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.
ఈ పేస్ట్ ని కంటి కింద భాగంలో రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
పాలు
పచ్చిపాలను కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి, ఆ పాలలో కాటన్ బాల్ ని ముంచి నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో ఉంచాలి.
పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం నల్లటి వలయాలను తగ్గించటంలో సహాయపడుతుంది.