సూర్యాపేట జిల్లా
: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లపై జరిగే దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులేననివాటికి భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డిఅన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలకు హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడుతూవిచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
కేసులు పెట్టి బయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారని,బీఆర్ఎస్ నాయకులంతా తెరిచిన పుస్తకాలేనని,వైట్ పేపర్ వ్యాపారాలేనని,పార్టీలోకి రాక ముందు నుండే వారికి వ్యాపారాలు ఉన్నాయని,పన్నులు లెక్క ప్రకారమే చెల్లిస్తున్నారని,ఐటీ దాడులతో బయపెట్టడం మూర్ఖత్వమే అవుతుందని,దాడులకు బయపడేదిలేదన్నారు.దాడులతో ప్రజలను, ప్రతిపక్షాన్ని అణచివేయడం అప్రజాస్వామికమని,బీజేపీది రాజకీయ కక్షేనని,ఎన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు.