ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యశ్రీ( Actress Ramyasri ) తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.నాకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉందని పేరెంట్స్ చెబుతారని రమ్యశ్రీ అన్నారు.
తప్పు చేసింది ఒకరైతే శిక్ష నేను అనుభవిస్తున్నానని రమ్యశ్రీ కామెంట్లు చేయడం గమనార్హం.నేను అడిగితే చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
నా ఓపిక చచ్చిపోతే మాత్రం నేను ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధమని రమ్యశ్రీ కామెంట్లు చేశారు.కుమ్మరి సురేష్( Kummari suresh ) అనే వ్యక్తి ఈరోజు బయటికొచ్చాడని ఆ వ్యక్తి ఏం చెప్పినా మంచి ఫ్రెండ్, తండ్రి చెబుతున్నాడని భావించానని ఆ వ్యక్తి చెప్పిన వర్క్ చేయకపోయినా ఐదేళ్లు ఓపికతో ఎదురుచూశానని రమ్యశ్రీ వెల్లడించారు.15 సంవత్సరాల క్రితం శ్రీశైలం యాదవ్ దగ్గర ల్యాండ్ కొన్నానని రమ్యశ్రీ( Ramyashree said that he bought land from Srisailam Yadav 15 years ago ) చెప్పుకొచ్చారు.

ఆ ల్యాండ్ కు సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ లేదని ఆ ల్యాండ్ తనకు దక్కలేదని రమ్యశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.శ్రీశైలం యాదవ్ డబ్బులు తీసుకున్నాడని రమ్యశ్రీ అన్నారు.సురేష్ అనే వ్యక్తి దొంగ అని ప్రూవ్ అయిందని ఆమె తెలిపారు.
చంద్రబాబు పేరు చెప్పుకుని ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడే వాళ్లు చాలామంది ఉన్నారని రమ్యశ్రీ కామెంట్లు చేయడం గమనార్హం.
మంచి స్థాయిలో ఉన్న నన్నే ఈ స్థాయిలో మోసం చేస్తున్నారంటే ఎలా అని ఆమె అన్నారు.
బిజినెస్ లో పోగొట్టుకుంటే అది వేరని ఆమె తెలిపారు.అమరావతిలో భూమి కొనడం తప్పా అని రమ్యశ్రీ అన్నారు.
తర్వాత మోసమని తెలియగా డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆమె చెప్పుకొచ్చారు.నేను స్క్రీన్ పై అలాంటి పాత్రల్లో కనిపించినా ఆ పాత్రలే చేస్తానని కాదని అన్ని పాత్రల్లో నటించగలనని రమ్యశ్రీ అన్నారు.