నిజమైన వారసులు కమ్యూనిస్టులే:మల్లు లక్ష్మి

తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి( Mallu Lakshmi ) అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ బహిరంగ సభకు ఆమె ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన పోరాటం మూలంగానే ప్రజలకు దోపిడీ,పీడనల నుండి విముక్తి కలిగిందన్నరు.

 Communists Are True Heirs Of Telangana, Telangana,communists,,mallu Lakshmi,tela-TeluguStop.com

నిజాం పాలనలో భూములన్నీ దొరలు, జాగీర్దార్లు,జమీందార్ల చేతుల్లో ఉండేవని,వారికి వ్యతిరేకంగా భూమి,భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం సాగించి లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేసిందన్నారు.సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధంలేని బీజేపీ( BJP ) వాస్తవ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు.

పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, భీంరెెడ్డి నర్సింహ్మరెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి కమ్యూనిస్టుల యోధులు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు.సాయుధ పోరాటానికి సంబంధంలేని బీజేపీ ఆ పోరాటాన్ని హిందూ, ముస్లింల పోరాటంగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు.

ఆనాడు పల్లెల్లో దొరలు జమిందార్లు చేస్తున్న ఆగడాలను ఎదిరించి పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు లదేనన్నారు.ఎన్నికల్లో ఓట్ల కోసం హిందూ మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.

అధిక ధరలు,నిరుద్యోగం, రైతులకు మద్దతు ధర, రాజ్యాంగ పరిరక్షణ, మహిళా రిజర్వేషన్లు, విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలపై పోరాటాలు సాగించాలని ప్రజలను కోరారు.వెట్టిచాకిరీ నుండి విముక్తి కల్పించడం కోసం ఆనాడు నిజాం నవాబును తరిమికొట్టిన స్ఫూర్తితో దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీని గద్దె దించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.

నిజాం లొంగిపోయేలా పోరాడిన కమ్యూనిస్టుల త్యాగాలను గుర్తించకుండా బీజేపీ, కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు తామేదో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపి,బిఆర్ఎస్( BRS ) తెలంగాణ పార్టీలకు సంబంధం లేదన్నారు.కమ్యూనిస్టులు నిర్వహించిన పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి ఇచ్చిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నారు.ఈ పోరాటంలో నాలుగు వేల మంది బలిదానంతో తెలంగాణ విముక్తి అయిందన్నారు.3000 గ్రామాలకు వెట్టి నుండి విముక్తి అయ్యాయని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube