దేశంలో అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి( Former minister Ramreddy dhamodar Reddy ) అన్నారు.బుధవారం కాశింపేట 4వ వార్డ్ లోని హక్స మసీద్ లో పవిత్ర రంజాన్ మాసం( Ramzan ) సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో( Iftar Party ) ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసి,ఇఫ్తార్ విందు లో పాల్గొని,ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు రోజ విడిపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.సూర్యాపేటకు వచ్చే నిధుల్లో 14 శాతం మైనార్టీలకు కేటాయిస్తామని,కాశీంపేట గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అన్ని మతాలకు స్వేచ్చాయుత వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కల్పించిందని, ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతోనే ముందుకు సాగాలన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన విధంగానే,రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, స్థానిక కౌన్సిలర్ జాటోతు లక్ష్మీమకట్ లాల్,4వ వార్డ్ ఇంచార్జి ధారవత్ నాగు నాయక్,పులిప్ దాస్,సలీం అప్ఖాన్,సిద్ధిక్,జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ నసీరుద్దీన్, కాసిం అలీ,పాషి,నాగుల్, నజీర్ బాబా,భిక్షం, వెంకటాచారి,దుర్గయ్య, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.