సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె జెడ్పీ హైస్కూల్ లో శిక్ష సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో శిక్షకుడు మామిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం 9,10 తరగతుల విద్యార్థిని,విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అలవరచుకోవాలని తెలిపారు.
అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు చిన్నతనం నుండి ఒక లక్షాన్ని ఏర్పాటు చేసుకొని,ఆ లక్ష్యసాధనకు అవసరమయ్యే విధంగా చదువుల్లో రాణించాలని తెలిపారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.