సూర్యాపేట జిల్లా:మానవ అక్రమ రవాణా సమాజ భద్రతకు చేటని,మానవ అక్రమరవాణా నిరోధానికి ప్రజల భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రత దృష్ట్యా రాష్ట్ర డీజీపీ ఏర్పాటు చేసిన యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ వింగ్ (ఏ.
హెచ్.టి.) అధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన మానవ అక్రమరవాణా వ్యతిరేక వారోత్సవ ప్రజా అవగాహన ర్యాలీనీ ఆయన జెండా ఊపి ప్రారంభించారు.జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి వయా శంకర్ విలాస్ సెంటర్,కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాపై ప్రజలందరూ అవగాహన పెంపొందించుకోవాలని,గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై అన్ని విభాగాలు నిఘా ఏర్పాటు చేసి సమాజ హితం కోసం పాటుపడాలని కోరారు.మానవ అక్రమ రవాణా అనేది సమాజ భద్రతకు,మనిషి మనుగడకు అత్యంత ప్రమాదకరమన్నారు.
ఇలాంటివి ఏదైనా సంభవించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాపై పోలీసు వారికి సమాచారం అందించాలని,పోలీసు వారికి సహకరించాలని అన్నారు.డయల్ 100 కు,112 టోల్ ఫ్రీ నంబర్ కు,8331940134 కు సమాచారం అందించాలని సూచించారు.
ఈ ర్యాలీలో డిఎస్పీ నాగభూషణం, పట్టణ సిఐ ఆంజనేయులు,సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవి కుమార్,స్పెషల్ బ్రాంచ్ సీఐ ప్రవీణ్ కుమార్,జిల్లా యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ ఎస్ఐ నరేష్ మరియు టీమ్ సిబ్బంది,మహిళలు,విద్యార్థులు,పౌరులు,టౌన్ ఎస్సైలు క్రాంతి,యాకూబ్,ట్రాఫిక్ ఎస్సైనరేష్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.