సూర్యాపేట జిల్లా:దురాజ్ పల్లి గొల్లగట్టు జాతరకు 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.జాతర ప్రాంగణంలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని,సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి 24 గంటల నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేస్తారని తెలిపారు.