సూర్యాపేట జిల్లా:దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల స్వామి జాతరలో రెండవ రోజు చౌడమ్మకి భోనాలు సమర్పణలో భాగంగా పెద్దగట్టు దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా దేవాలయ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, యాదవ పూజర్లు మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు నిబద్దతతో మొక్కులు చెల్లించే భక్తులు,వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.భక్తుల రద్దీ పెరుగుతున్నందున దేవాలయం వద్ద క్యూ లైన్,మెట్ల ద్వారా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
గుట్ట పైన,క్రింద పరిసర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని,అలాగే భక్తులకి త్రాగునీరు,విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు.జాతరలో అధికారులు అందరు సమన్వయంతో తమకి కేటాయించిన సెక్టారులలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవరావు రావు, తహసీల్దార్ లు శ్యామ్ సుందర్ రెడ్డి,కృష్ణయ్య,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,ప్రత్యేక అధికారులు,దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.