అర్థరాత్రి పేటలో హై టెన్షన్..!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డికి పార్టీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించి,రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ఖరారు చేయడంతో రమేష్ రెడ్డి మద్దతుదారులు గురువారం అర్థరాత్రి జిల్లా కేంద్రంలో హంగామా సృష్టించారు.

 Patel Ramesh Reddy Supporters Protest In Suryapet, Patel Ramesh Reddy , Protest-TeluguStop.com

హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హై వే పై రాస్తారోకో చేపట్టి, వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు.పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులో పెట్టారు.

దీనితో పేటలో అర్థరాత్రి హై టెన్షన్ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube