జిల్లా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ( Suven Pharma Company ) ప్రక్కన పోలీసు శాఖ,సువెన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్,షీ టీమ్స్ కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేదింపులు,హత్యాచారం, దాడులకు,నిరాదరణకు గురైన బాధిత మహిళలకు,పిల్లలకు ఒకే చోట కేసుల నమోదు, వైద్య,న్యాయ,మానసిక ధైర్యం, అవసరమైన పిల్లలకు విద్యా వసతి,పునరావాసం,కౌన్సిలింగ్ ఇవ్వడం,కోర్టుల విషయాలు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ భరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం అనే ఆలోచన చాలా మంచి విషయమని,ఈ ఆలోచన చేసిన పోలీసు శాఖను, భాగస్వామ్యమైన సువెన్ ఫార్మా ట్రస్ట్ ను అభినందిస్తున్నానని అన్నారు.
మహిళల రక్షణలో పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని,మహిళలను,బాలలను వేధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భౌతిక దాడులను,హత్యాచార దాడులను అడ్డుకోవడం మన అందరి బాధ్యతని, వేధింపులకు సంబంధించి దైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.
భరోసా సెంటర్, షీ టీమ్స్( She Teams ) పని తీరు,చట్టాల అమలుపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు.జిల్లాలో గంజాయి రవాణా,అమ్మకాలను నిరోధించడంలో పోలీసు శాఖ నిరంతర కృషి చేయాలని, గాంజా ములాను గుర్తించి పూర్తి స్థాయిలో అరికట్టాలని, గంజాయి రహిత జిల్లాగా, గంజాయి రహిత రాష్ట్రంగా చేయండంలో బాగా పని చేయాలని ఆదేశించారు.
ఎస్పీ భరోసా సెంటర్( Bharosa Center ) యొక్క ఏర్పాటు లక్ష్యం,ఉద్దేశ్యం గురించి వివరించారు.దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో భరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే అన్నారు.
మహిళల రక్షణగా,పిల్లలపై లైంగికదాడుల నివారణ, నిరాదరణకు,దాడులకు గురైన మహిళలకు,పిల్లలకు అండగా ఉండడం,ఒకేచోట అవసరమైన అన్ని సహాయాలు అందించడం లక్ష్యమని అన్నారు.కేసులో నేరస్తునికి శిక్షపడే వరకు,కేసు ముగిసే వరకు సపోర్ట్ పరసన్,లీగల్ అడ్వైసర్, మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈకార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామెలు, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ పద్మ,సువెన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రామ్ కుమార్,సంస్థ అధికారులు శేషగిరి,వెంకట్ రెడ్డి,మాజీ మంత్రి దామోదర్ రెడ్డి,చెవిటి వెంకన్న,వేణారెడ్డి,అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి,డిడబ్ల్యుఓ వెంకటరమణ,డిసిపిఓ రవి కుమార్,డిఎస్పీ జి.రవి, భరోసా సెంటర్ ఎస్ఐ మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.