కయ్యానికైనా.వియ్యానికైనా సమఉజ్జీలు కావాలంటారు పెద్దలు.
సినిమాల్లోనూ అంతే హీరో దమ్మేందో తెలియాలంటే అంతే దమ్మున్న విలన్ కావాలి.అందుకే చాలా మంది ఫిల్మ్ మేకర్స్.
పవర్ ఫుల్ విలన్లను తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు.గతంలో మాదిరిగా కాకుండా పాష్ లుక్ లో అదరగొట్టే విలన్ క్యారెక్టర్లను రూపొందిస్తున్నారు.
గతంలో చాలా మంది విలన్ పాత్రలు పోషించి హీరోలుగా మారితే.ప్రస్తుతం హీరోలే విలన్లుగా నటిస్తున్నారు.ప్రస్తుతం విలన్లుగా రాణిస్తున్న యంగ్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆది పినిశెట్టి
యంగ్ హీరో ఆది పినిశెట్టి మరోసారి విలన్ రోల్ పోషించబోతున్నాడు.రామ్- లింగుస్వామి కలిసి ఓ సినిమా చేస్తున్నారు.ఇందులో ఆది విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు.ఇప్పటికే ఆది పలు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు.అజ్ఞాతవాసి, సరైనోడు సినిమాల్లో సూపర్ లుక్ తో విలన్ క్యారెక్టర్ చేసి వారెవ్వా అనిపించాడు.ప్రస్తుతం రామ్ తో ఢీకొట్టబోతున్నాడు.
కార్తికేయ

మరో యంగ్ హీరో కార్తికేయ కూడా విలన్ రోల్ కు ఓకే చెప్పాడు.వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడమే ప్రధానంగా ముందుకు సాగుతున్నాడు.నెగెటివ్ షేడ్ ఉన్నా.
విలన్ క్యారెక్టర్ అయినా.దేనికైనా రెడీ అంటున్నాడు.
తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో విలన్ గా కనిపంచబోతున్నాడు.అజిత్ హీరోగా ప్రస్తుతం వాలిమై అనే సినిమా తెరెక్కుతున్నది.
ఇందులో కార్తికేయ విలన్ రోల్ చేస్తున్నాడు.అటు ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు కార్తికేయ.
ఫాహాద్ ఫాజిల్

మరో యంగ్ హీరో ఫాహాద్ ఫాజిల్ కూడా విలన్ రోల్స్ బాట పట్టటాడు.బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం పలువురుని టెస్ట్ చేసిన సుకుమార్.చివరకు ఫాహాద్ ను ఓకే చేశాడు.తొలిసారి తెలుగు తెర మీద ఆయన విలన్ రోల్ చేయబోతున్నాడు.
విజయ్ సేతుపతి

తమిళ టాప్ హీరో విజయ్ సేతుపతి కూడా విలన్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్నాడు.తాజాగా కమల్ హాసన్ సినిమా విక్రమ్ లో విజయ్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.కమల్ కు పోటీగా నటించబోతున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ అయ్యింది.అందులో విజయ్ లుక్ అదిరిపోయింది.