ఈ హోమ్ మేడ్ సీరంను వాడితే కళ్ల చుట్టూ నలుపు వారం రోజుల్లో మాయం అవుతుంది!

సాధారణంగా కొందరికి ముఖం మొత్తం ఎంతో తెల్లగా మృదువుగా మెరిసిపోతూ ఉంటుంది.కానీ కళ్ళ చుట్టూ మాత్రం నల్లగా ఉంటుంది.

 Home Made Serum For Removing Dark Circles Naturally! Homemade Serum, Dark Circle-TeluguStop.com

ఒత్తిడి, నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం, శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం, ఆహారపు అలవాట్లు, డిప్రెషన్, మద్యపానం, ధూమపానం తదితర కారణాల వల్ల ఈ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.ఇవి అందాన్ని పాడు చేస్తాయి.

అందుకే చాలా మంది కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను నివారించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరంను వాడితే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు వారం రోజుల్లో మాయం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), రెండు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.

Telugu Tips, Dark Circles, Homemade Serum, Latest, Serum, Skin Care, Skin Care T

చివరిగా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ) ను వేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు ఆగకుండా స్పూన్ సహాయంతో కలపాలి.తద్వారా మంచి సీరం సిద్ధమవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ హోమ్ మేడ్ సీరంను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Circles, Homemade Serum, Latest, Serum, Skin Care, Skin Care T

ప్రతిరోజు ఈ విధంగా చేస్తే కనుక కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా మాయం అవుతాయి.కేవలం కొద్ది రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్ ను మీరు గమనిస్తారు.కళ్ళ చుట్టూ ఎంత నలుపు ఉన్నా సరే ఈ హోమ్ మేడ్ సీరం సులభంగా తొల‌గిస్తుంది.

కాబట్టి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉన్నాయని సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube