యంగ్ హీరో నిఖిల్( Hero Nikhil ) గత ఏడాది కార్తికేయ 2( Karthikeya 2 ) మరియు 18 పేజెస్( 18 Pages Movie ) సినిమా లతో వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు.ముఖ్యంగా కార్తికేయ 2 సినిమా వంద కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.
గత ఏడాది రెండు సినిమా లు విజయాన్ని సాధించడంతో నిఖిల్ హ్యాట్రిక్ పై కన్నేశాడు.ఇటీవలే వచ్చిన స్పై సినిమా తో( Spy Movie ) విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ దక్కించుకోవాలని ఆశ పడ్డాడు.
మరి స్పై సినిమా ఫలితం ఏంటి అనేది మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.హీరో గా నిఖిల్ స్పై సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
ఆయన అంచనాలు మరియు నమ్మకం నిజం అయ్యింది.సినిమా మంచి ఫలితాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.అంతే కాకుండా వసూళ్లు కూడా బాగానే వచ్చాయి.మొదటి మూడు రోజులు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి.సినిమా వీకెండ్స్ లో మంచి వసూళ్లు దక్కించుకున్నా కూడా వీక్ డేస్ లో మాత్రం సినిమా ఆడటం కష్టమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ నాలుగు రోజులు సినిమా కాస్త అయినా కలెక్షన్స్ రాబట్టి మళ్లీ వీకెండ్ లో ఒక మోస్తరు వసూళ్లు దక్కించుకున్నా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అన్నట్లుగా
బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్పై సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మరియు ఫలితం పై క్లారిటీ రావాలి అంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాలి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నిఖిల్ గత చిత్రం మాదిరిగానే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా యూనిట్ సభ్యులు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.