దుంప జాతికి చెందిన చిలగడ దుంప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తియ్యగా ఉండే చిలగడ దుంపతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు.
అయితే చిలగడ దుంపలు చూడగానే చాలా మంది ముఖం తిప్పేస్తారు.కానీ, వీటిల్లో పోషకాలు మాత్రం దండిగా ఉంటాయి.
ఉడికించుకునో, కూరగా వండుకునో, కాల్చుకునో.ఇలా ఎలా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
ఇక ఈ కరోనా సమయంలో చిలగడ దుంపలు తినడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే.చిలగడ దుంపలు మనసరీరానికి అవసరమైన మినరల్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.ఇవి తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడతాయి.
తద్వారా కరోనా వంటి అనేక వైరస్‌లతో పోరాడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే చిలగడ దుంపలో ఉండే విటమిన్ సి.జలుబు, ఫ్లూ వంటి రోగాలను తగ్గిస్తుంది.శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంతో పాటు.
షుగర్ లెవర్స్‌ను అదుపు చేసే శక్తి చిలకడ దుంపలకు ఉంది.అందుకే చిలగడ దుంపను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అదేవిధంగా, ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇక సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి.చిలగడ దుంప ద్వారా కూడా పొందొచ్చు.ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉండడం వల్ల.
అనేక జబ్బుల నుంచి రక్షించడంతో పాటు బలమైన ఎముకలను కూడా ప్రోత్సహిస్తుంది.మరియు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా చిలగడ దుంపల్లో ఉంటాయి.
కాబట్టి, వీటిని వారానికి కనీసం రెండు, మూడు సార్లు తీసుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.