సూర్యాపేట జిల్లా: ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో వేగం పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రత్యేక అధికారులు,వార్డు ఇంఛార్జీల సమక్షంలో రెండో రోజు డేటా ఎంట్రీ సంబంధిత కేంద్రాలలో శరవేగంగా జరుగుతుందన్నారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 83,322 దరఖాస్తులను ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయడం జరిగిందని,నిర్దేశించిన సమయానికి నిరంతర ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.