సూర్యాపేట జిల్లా:రాజకీయ నేతలపైన,సినీ హీరో,హీరోయిన్ల పైన అభిమానం ఉండటం సహజమే.కానీ,ఒక్కోసారి ఆ అభిమానం హద్దులు దాటి అనర్ధాలకు దారిన తీసిన సందర్భాలు లేకపోలేదు.
అలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోదాడ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్లెక్సీలు కట్టే విషయంలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ వా నెలకొంది.థియేటర్ పై ఫ్లెక్సీ కట్టే సమయంలో మా ఫ్లెక్సీ ముందు కనపడేలా ఉండాలంటూ ఇరువురు గొడవకు దిగారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమాని రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఘర్షణకు దిగిన వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడంతో ఇప్పుడు అభిమానం కాస్త అరెస్ట్ అయ్యిందని అనుకుంటున్నారు ఈ వెర్రితలలు వేస్తున్న యువత చూసి.