అవార్డులు ఉపాధ్యాయుని బాధ్యతను పెంచుతాయి

సూర్యాపేట జిల్లా:సావిత్రిబాయి పూలే జీవితం ఎన్నటికీ స్ఫూర్తి దాయకమని,ఆమె పెంపొందించిన విద్యా మానవీయ విలువలు ఉపాధ్యాయ లోకానికి ఆదర్శనీయమని కీతవారిగూడెం కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ముప్పాళ్ళ సువర్ణ,ఎస్ టి యు రాష్ట్ర నాయకులు కెవి సత్యనారాయణ అన్నారు.సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు నందిపాటి ఇందిర ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు పొంది మంత్రి సీతక్క చేతుల మీదగా అవార్డు స్వీకరించిన సందర్భంగా ఎస్ టి యు ఆధ్వర్యంలో గురువారం గరిడేపల్లి మండల ఎస్టియు అధ్యక్షుడు సత్తూరి భిక్షం అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు.

 Awards Increase The Teacher's Responsibility, Awards Increase, Savitribai Phule,-TeluguStop.com

ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ చాంద్ మియా మాట్లాడుతూ అవార్డులు ఉపాధ్యాయుని బాధ్యతను మరింత పెంచుతాయని.విద్యా సామర్ధ్యాలు పెంచడంలో యువ ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కీతవారిగూడెం హెడ్మాస్టర్ ఉమ,ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి గొర్రె నాగరాజు, జిల్లా నాయకులు పాలూరి అంజయ్య,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కె.వీరస్వామి,ఎన్.సక్రు నాయక్,బి.రమేష్,పి.వీరస్వామి,నర్సిరెడ్డి,రఫీ, సంధ్య,మంగమ్మ, రాజ్యలక్ష్మి,చంద్రకళ, నాగలక్ష్మి,మైథిలి,సుజాత, జ్యోతి,నాగమణి,శైలజ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube