నాసాకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:నేషనల్ స్పేస్ సొసైటీ అమెరికా (నాసా)వారు నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2022లో ఎంపికయిన ప్రాజెక్ట్ చేసిన విద్యార్థులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని అన్నారు.

పట్టణానికి చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి గెలుపొందడం అభినందనీయమని అన్నారు.విద్యార్థులను వారికి ఇష్టం వచ్చిన రంగాలలో ప్రోత్సహించి వాటిలో విజయం సాధించేలా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలని సూచించారు.

నాసాకు ఎంపికైన విద్యార్థులు మునుముందు మరెన్నో విజయాలు సాధించాలని విద్యార్థులను ఆశీర్వదించారు.ప్రపంచంలోని 25 దేశాలకు సంబంధించిన విద్యార్థులు పోటీపడగా 145 ప్రాజెక్టులను ఎంపిక చేశారని వీటిల్లో భారతదేశానికి చెందిన ప్రాజెక్టులు 107 ఉన్నాయని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ శ్రీ చైతన్య పాఠశాల ఒక్కటే నాసా పోటీల్లో విజయం సాధించిందని ప్రిన్సిపల్ పోసాని వెంకటరమణారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ సమన్వయకర్త ఓమేష్,డీన్ నాగ సైదులు,శ్రీనివాస్ రెడ్డి,ఏవో మద్దూరి వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
డ్రై స్కిన్ ను రిపేర్ చేసే చియా సీడ్స్.. ఇలా వాడితే మరిన్ని లాభాలు మీ సొంతం!

Latest Suryapet News