అనంతగిరి మండలంలో మంత్రాల నెపంతో వృద్ధురాలు ఆటవిక హత్య

సూర్యాపేట జిల్లా:మనిషి సైన్స్ పై పరిశోధనలు చేస్తూ అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఆధునిక సమాజంలో కూడా ఇంకా చేతబడి,బాణామతి,సిల్లంగి వంటి మూఢనమ్మకాల పేరుతో ఆటవిక హత్యలు జరగడం మానవ సమాజానికి సిగ్గు చేటుగా చెప్పుకోవాలి.ఇలాంటి ఒక అనాగరిక సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురారం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

 An Old Woman Was Killed On The Pretext Of Mantras In Anantgiri Mandal , Anantgir-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.త్రిపురారం గ్రామానికి చెందిన కొమ్ము అలివేలమ్మ (70)భర్త నరసయ్య చేతబడి పేరుతో మంత్రాలు చేస్తుందని భావించిన అదే గ్రామానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి తన స్నేహితునితో కలసి సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అలివేలమ్మ మెడకు తాడు బిగించి అత్యంత పాశవికంగా హత్య చేశారు.మృతురాలి మనవడు సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఎస్ఐ జి.అజయ్ కుమార్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube