సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామ శివారులో వారం రోజుల క్రితం రోడ్డుకు ఇరువైపులా మట్టిపోస్తుండగా డోజర్ ఢీ కొని కరెంట్ స్తంభం విరిగి, తీగకు కిందకు వాలి పోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.దీనితో మోటర్లు నడవక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులు అవుతున్నా విద్యుత్ అధికారులు
ఎలాంటి చర్యలు తీసుకోలేదని,తీగలు కిందికి ఉండడంతో తెలియక అటువైపు వెళ్ళే మూగజీవాలు,మనుషులు ప్రమాదం బారినపడే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు.