ఏపీలో ప్రతిపక్ష టీడీపీ పార్టీని స్కామ్ లు ఏ స్థాయిలో చుట్టూముడుతున్నాయో చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( TDP Chandrababu Maidu ) జైల్లో ఉన్నారు.
ఇక ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వంతు వచ్చినట్లు తెలుస్తోంది.అమరావతి రింగ్ రోడ్ విషయంలో ఇప్పటికే లోకేష్ కు నోటీసులు కూడా జారీ చేసింది సీఐడీ.
ఈ స్కామ్ తో పాటు ఫైబర్ గ్రిడ్ స్కామ్ కూడా చుట్టూముట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.కాగా ఈ స్కామ్ లన్ని కక్ష సాధింపు చర్యలేయని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

కాగా నారా లోకేష్( Nara Lokesh ) గత కొన్ని రోజులుగా డిల్లీ లోనే మకాం వేశారు.ఆయన హటాత్తుగా డిల్లీ పర్యటన ఎందుకు చేస్తున్నారనేది ఇప్పటికే ప్రశ్నార్థకంగానే ఉంది.ప్రస్తుతం ఏపీలో బయటపడుతునన్ స్కామ్ ల విషయంలో కేంద్ర సహకారం కొరేందుకే లోకేష్ డిల్లీ వెల్లరనేది కొందరి వాదన.కాగా ఆయన డిల్లీలో ఉన్నప్పటికి సీఐడీ డిల్లీ వెళ్ళి మరి నోటీసులు ఇచ్చింది.
అయితే అందిన నోటీసులల్లో స్కామ్ కు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం కుట్ర పూరితంగానే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని లోకేష్ మండిపడ్డారు.

సీఐడీ విచారణ( AP CID ) ఎప్పుడు కోరితే తాను విచారణకు హాజరవుతానని వాయిదాలు వేసుకోవాల్సిన అవసరం తనకు లేదని నారా లోకేష్ ఖరాఖండీగా చెప్పేశారు.దీంతో లోకేష్ కాన్ఫిడెంట్ ను చూస్తుంటే కొత్త సందేహాలు రాజకీయ విశ్లేషకులు హాజరవుతున్నారు.తప్పు చేసిన వారు విచారణ విషయంలో వెనుకడుగు వేస్తారని అందరికీ తెలిసిందే.
గతంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) ఎన్నోమార్లు సిబిఐ విచారణను వాయిదా వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కానీ నారా లోకేష్ మాత్రం విచారణకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
దీంతో నిజంగానే అక్రమంగా జగన్ సర్కార్( YS Jagan Government ) కేసులు పెడుతోందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ఏది ఏమైనప్పటికి.తాను తప్పు చేయలేదని నారా లోకేష్ చూపిస్తున్న కాన్ఫిడెంట్ గమనించాల్సిన విషయం.