సూర్యాపేట జిల్లా:ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలు గురించి చర్చించి వాటి పరిష్కారానికి మార్గం చూపాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి,గౌరవ మంత్రులకు గౌరవ శాసనసభ మరియు,గౌరవ శాసనమండలి సభ్యులకు,ప్రెస్ అకాడమీ చైర్మన్ గారికి,రాష్ట్ర సమాచార ప్రచారశాఖ కమిషనర్ మరియు అధికారులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పత్రికల్లో మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని తమరికి విన్నవించుకుంటున్నాము.
ఎంప్యానల్ తో సంబంధం లేకుండా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు చేరవేస్తూ వారధులుగా నడుస్తున్న జర్నలిస్టులకు కొందరికి మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ చేయబడిన మీడియాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు,హెల్త్ కార్డులు,పోలీస్ భరోసా కార్డులు, ప్రత్యేక డబుల్ బెడ్రూం ఇండ్లు లేదా ఇంటి స్థలాలు ఇవ్వాల్సిందిగా తమరికి విన్నవించుకుంటున్నాము.ఇంతే కాకుండా జర్నలిస్టుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా మీడియా రంగానికి విలువనిస్తూ ప్రతి మండల నియోజకవర్గ కేంద్రాలలో ప్రెస్ క్లబ్ లు,ప్రతి జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన జర్నలిస్టు భవన్ లు నిర్మించాలని తమరికి విన్నవించుకుంటున్నాము.
అంతేకాకుండా గత ప్రభుత్వాల హయాంలో ఇంటి స్థలాలు,లేదా ఇండ్లు ఇతరత్రా లబ్ధి పొందిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని మినహాయించి ఎంతోకాలంగా జర్నలిజం వృత్తిలో ఉండి ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి లబ్ధి పొందని జర్నలిస్టులను గుర్తించి ఇంటి స్థలాలు లేదా ప్రత్యేక డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రభుత్వం నుండి ఇవ్వాల్సిందిగా తమరి దృష్టికి తీసుకువస్తున్నాము.మా ప్రధాన సమస్యలైన వీటిని ప్రస్తుతం అసెంబ్లీలో చర్చించాల్సిందిగా తమరికి విన్నవించుకుంటున్నాము.
ఇట్లు తమ విధేయుడు కందుకూరి యాదగిరి,తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.9640282050
.