భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి ప్రపంచంలోనే భారతదేశానికి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిన సందర్భంగా తిరుమలగిరి క్రాస్ రోడ్ లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.

 Constitution Of India Ratification Day-TeluguStop.com

అంబేద్కర్ విగ్రహానికి సామాజిక తెలంగాణ మహాసభ జంబుద్వీప జన సమితి బీసీ సంక్షేమ సంఘం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో పూలమాలవేసి మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత దేశంలో కుల వ్యవస్థ ఉందని,తద్వారా సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలియజేశారు.కానీ,ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా నేటి పాలకులు అమలు చేయకపోవడం వలన స్వాతంత్రం వచ్చిన కానుండి నేటి వరకు ఈ దేశంలో సామాజిక వివక్షతో దళితుల మీద హత్యలు,అత్యాచారాలు పెరగిపోతున్నాయన్నారు.

నిరుద్యోగం,పేదరికం పూర్తిగా పెరిగిపోయినవని,అధికారం రాజ్యాంగ వ్యతిరేక శక్తుల చేతిలో ఉండడం వల్ల పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలియజేశారు.రాబోయే రోజుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, ముస్లిం మైనారిటీ,అగ్రవర్ణ పేదలు ఏకమై రాజ్యాధికార దిశగా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జంబుద్వీప జన సమితి రాష్ట్ర కన్వీనర్ పత్తేపురం యాదగిరి,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు, మహాజన సోషలిస్టు పార్టీ ఎంఎస్పి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్ కందుకూరి సోమన్న మాదిగ,బీసీ సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షులు పోరెల్ల లక్ష్మయ్య,తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కారుపోతుల రాజకుమార్, ప్రజా కళాకారుడు బూర్గుల ప్రభాకర్,కళాశ్రీ,ప్రవీణ్,ఎండి రెహమాన్,ఎండి అబ్బాస్,పోతరాజు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube