విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో పోరాటం:మల్లు

సూర్యాపేట జిల్లా:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో హైదరాబాద్లోని బషీర్ బాగ్ లో జరిగిన విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితో నేడు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం బషీర్ బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల 22వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు.

 Fighting In The Spirit Of Vidyut Martyrs: Mallu-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపుతుంటే వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి గద్దె దించిన చరిత్ర ఉందన్నారు.నాటి పోరాటం లాగానే నేడు బిజెపి ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయడం కోసం పోరాటాలు కొనసాగించాలని అన్నారు.

విద్యుత్ సంస్కరణల మూలంగా ప్రజలపై భారాలు విపరీతంగా పడతాయని అన్నారు.వ్యవసాయానికి విద్యుత్ మోటార్లు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేస్తుందన్నారు.

ప్రభుత్వ రంగంలో నడుస్తున్న విద్యుత్ రంగాన్ని ప్రయివేట్ కంపెనీల చేతుల్లో పెట్టి దేశాన్ని దివాళా తిస్తున్నందని అన్నారు.ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు అంబానీ ఆదని లకు అప్పగించి దేశాన్ని అమ్మేస్తుందన్నారు.

దేశాన్ని రక్షించుకోవడం కోసం, విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్,కోట గోపి,దనియాకుల శ్రీకాంత్, బెల్లంకొండ సత్యనారాయణ,వీరబోయిన రవి,సీపీఎం చిలుకూరు మండల కార్యదర్శి నాగటి రాములు, సీపీఎం పట్టణ నాయకులు వల్లపుదాస్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube