సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల( Parliamentary elections ) నేపథ్యంలో జిల్లాలో ఎఫ్.ఎల్.
సి,మాక్ పోలింగ్ విజయవంతంగా చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S Venkatrao) అన్నారు.
గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవిఎం గోదాంను అదనపు కలెక్టర్ సిహెచ్.ప్రియాంకతో కలసి సందర్శించి చేపట్టిన మాక్ పోల్ ను పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఈ నెల 5 నుండి చేపట్టిన ఎఫ్.ఎల్.సి,మాక్ పోలింగ్ విజయవంతంగా చేపట్టాని ఈసిఎల్ ఇంజనీర్లు,రెవెన్యూ సిబ్బందిని ఎఫ్.ఎల్.సి లో సద్వినియోగం చేసుకున్నామన్నారు.
మొత్తం వివిఫ్యాట్స్ 1847, బి.యు లు 2689,సి.యు లు 1736 ఎఫ్.ఎల్.సి.చేపట్టామని అలాగే తదుపరి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహణలో 1200 ఓట్లకు గాను 75 రౌండ్స్ కు 2 శాతం,1000 ఓట్లకు గాను 64 రౌండ్స్ కి ఒక శాతం, అలాగే 500 ఓట్లకు గాను 32 రౌండ్స్ కి ఒక శాతం మాక్ పోలింగ్ నిర్వహించి ముగించడం జరిగినందని అన్నారు.మాక్ పోల్ అనంతరం ఈవీఎంలు గోడౌన్ లో భద్రపరిచి అన్ని రాజకీయ ప్రతినిధుల సమక్షంలో సీలు వేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీవో కృష్ణయ్య,హుజూర్ నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ( RDO Jagadeeswar Reddy, Kodada RDO Suryanarayana ),ఆయా నియోజకవర్గాల తహశీల్దార్లు,ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు,కాంగ్రెస్ పార్టీ నుండి చకిలం రాజేశ్వరరావు,బీజేపీ నుండి అబిడ్,బీఆర్ఎస్ నుండి దేవరశెట్టి సత్యనారాయణ, సిపిఎం నుండి కోట గోపి, వై.ఎస్.ఆర్.సి.పి డేగల రమేష్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.