జిల్లాకు బారిగా కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్ర పోలీసు సిబ్బంది రాక: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తేదీ సమీపిస్తున్న వేళ సూర్యాపేట జిల్లాలో పోలీసు బందోబస్తు నిర్వహణకు పోలీసు సిబ్బంది వినియోగం, డిప్లాయ్మెంట్ కు సంబంధించి శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం నందు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు ఎస్పి నాగేశ్వరరావుతో కలిసి జిల్లాలో ఉన్న డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో జరగనున్న ఎన్నికలకు నిబంధనల ప్రకారం పోలీసు సిబ్బందిని కేటాయించడంపై ఎస్పీ సూచనలను అందించారు.

 Arrival Of Central Forces And Other State Police Personnel In The District Sp Ra-TeluguStop.com

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల తేదీ సమీపిస్తున్నందున అత్యంత ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని, జిల్లాలో పోలీసు సిబ్బంది కేటాయింపులు పక్కాగా చూసుకోవాలని, నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారులను, సర్కిల్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.

ప్రతి మార్గంలో స్థానికంగా అవగాహన కలిగిన పోలీసు అధికారిని రూట్ గైడ్ గా ఉంచాలని,కేంద్ర బలగాలకు కచ్చితమైన నిర్దేశాలు చూపాలని అన్నారు.

సిబ్బందిపై వత్తిడి లేకుండా కేటాయింపు ఉండాలని సూచించారు.అలాగే రూట్ మొబైల్ టీమ్ కు అనుబంధంగా వేగంగా స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పని చేయాలని అన్నారు.జిల్లాకు పెద్ద మొత్తంలో కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్ర పోలీసులు వస్తున్నారని తెలిపారు.ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ నిర్వరామంగా పని చేయాలని సమయం సర్దుబాటు చేసుకోవాలని కోరారు.

సిబ్బంది ఆరోగ్యం పట్ల దృష్టి ఉంచి వత్తిడికి లోనవకుండా మానసికంగా దృఢంగా ఉంచాలన్నారు.

ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న ప్రతి అధికారి,సిబ్బందితో సమన్వయం ఉండాలని, సమయపాలన ఉండాలని, విధులు నిర్వహణ పట్ల సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించామని అన్నారు.

చేయవలసిన, చేయకూడని విషయాలతో చేతి పుస్తకం ప్రతి సిబ్బందికి అందించాలని ఆదేశించారు.పోలింగ్ బూత్ వద్ద నిర్వహించాల్సిన విధులు,ఈవీఎంలు తీసుకురావడం, తీసుకెళ్లడం అత్యంత ప్రధానమైనవన్నారు.పోలీస్ నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందిని మోటివేషన్ చేయాలని, స్థానికంగా ఎస్ఐలు వేగంగా స్పందించాలని, మానిటరింగ్ అధికారులు, నోడల్ అధికారులు నిచితంగా పర్యవేక్షణ చేయాలని కోరారు.

పోలీస్ కమ్యునికేషన్ వ్యవస్థ, ఐటి వ్యవస్థ లోపాలు లేకుండా పని చేయాలని సూచించారు.

ఎలక్షన్ సెల్ ఎప్పటికప్పుడు ప్రక్రియను నమోదు చేయాలని, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది స్థానికంగా ఇంటలిజెన్స్ ను సేకరించాలన్నారు.ప్రతి మండలానికి ఎస్ఐ అధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ పని చేస్తుందని, సర్కిల్ పరిధిలో సీఐ అప్రమత్తంగా ఉంటారని, ప్రతి నియోజకవర్గ పరిధిలో పోలీస్ నోడల్ అధికారి అధీనంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పని చేస్తుందన్నారు.

సమస్యలు తలెత్తకుండా పని చేస్తామని,ఈ ప్రక్రియలో పోలీసుతో పౌరుల భాగస్వామ్యం చాలా ముఖ్యమని కోరారు.ప్రతి గ్రామానికి పోలీసు స్ట్రైకింగ్ ఫోర్స్ అత్యంత వేగంగా చేరేలా ప్రణాళిక చేశామన్నారు.

ఈ సమావేశంలో డిఎస్పీలు నాగభూషణం, ప్రకాష్, రవి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్,ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ మహేష్,సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, అశోక్,శివశంకర్,బ్రహ్మ మురారి,రామలింగారెడ్డి, వీరరాఘవులు, రామకృష్ణారెడ్డి,రాము,రవి కుమార్,సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాగార్జున,ఆర్ముడ్ రిజర్వ్ ఆర్ఐ నారాయణరాజు, కమ్యునికేషన్ ఎస్ఐ రాంబాబు,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube