సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పని చేస్తున్న ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సీఐటీయు అధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలో కొనసాగించారు.అనంతరం ఖమ్మం – సూర్యాపేట నేషనల్ హైవే పై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్ల మండల అధ్యక్షురాలు హుస్సేని మాట్లడుతూ గత 18 ఏళ్ల నుండి ప్రజారోగ్యంపై నిరంతరం శ్రమిస్తున్నా పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఆశాల పనిని దృష్టిలో పెట్టుకొని పనికి తగ్గ రూ.21 వేల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని, ఉద్యోగ,బీఆరోగ్య భద్రత కల్పించాలని,అర్హులైన ఆశాలకు ఏఎన్ఎంలుగా అవకాశం కల్పించాలని,
విధి నిర్వహణలో మృతి చెందిన ఆశాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని, మరణించిన ఆశాల కుటుంబ సభ్యులను కారుణ్య నియామకం చేయాలని,రాజకీయ, అధికారుల వేధింపులు అరికట్టాలని,రికార్డుల పేరుతో చేయిస్తున్న వెట్టి చాకిరికి స్వస్తి పలికాలని డిమాండ్ చేశారు.తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఆశాలు అనిత, నాగమణి,విజయ,శ్రీదేవి, నీల,శైలజ,కె.ఉపేంద్ర,సునిత,సైదమ్మ,మంగమ్మ,పి.ఉపేంద్ర,ఖాదర్ బీ, జ్యోతి,దిశనమ్మ,లలిత,రజిత తదితరులు పాల్గొన్నారు.