మురికి కాల్వ కల్వర్టును వెంటనే మూసివేయాలి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బాబూ జగజ్జివన్ రామ్ విగ్రహం దగ్గర మురికి కాలువ కల్వర్టు ఓపెన్ గా ఉండి ప్రజలకు ఇబ్బందిగా మారిందని, వెంటనే దానిని మూసివేయాలని సీపీఐ (ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు.

 Dirty Canal Culvert Should Be Closed Immediately, Dirty Canal Culvert , Sewage C-TeluguStop.com

సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కాలువను పరిశీలించి, నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3,4 సంవత్సరాలు నుండి కాలువను ముసివేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,ఈ కాలవ సూర్యాపేట బస్టాండ్ చౌరస్తాలో ఉండటం,ఇక్కడ ఎప్పుడు జన సంచారం, వాహనాలతో రద్దీగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

అదేవిధంగా దీని పక్కనే అనేకమంది బతుకు తెరువు కోసం చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు,పాన్ షాపులు,టి స్టాళ్లు పెట్టుకొని జీవిస్తున్నారని, రోడ్డు వెడల్పు చేసినప్పుడు ఈ కల్వర్టు మూయకుండా అలాగే ఉంచి వివిధ కారణాలు చూపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారన్నారు.

ఈ కాలువ అలాగే ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న జనాలకు అక్కడి నుండి వెల్లె వాళ్లకు ఆ దుర్గంధపు వాసన పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయన్నారు.ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి మురికి కాలువ పనులు పూర్తి చేసి ప్రజలకు,ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న,పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వీరబోయిన రమేష్,పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్,వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube