సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డులో పాత ఇనుము కొట్టులో కొత్త మహీంద్రా వాహనం దగ్దమైన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.కొద్దిసేపటి క్రితం పాత ఇనుము కొట్టుకు వాహనాన్ని తీసుకువచ్చిన కొంత మంది వ్యక్తులు వాహనాన్ని డిస్మిటల్ చేసే క్రమంలో కొత్త సామాగ్రి తొలగించి కొంత వెల్డింగ్ ద్వారా తొలగిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగి వాహనం పూర్తిగా కాలి బుడిదయ్యింది.
వాహనం దొంగతనం చేసిన వాహనంగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా మంటలు చెలరేగాయన్న విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు అగ్నిమాపక యంత్రంతో సంఘటన స్థలానికి చేరుకొని స్క్రాప్ వాహనామని చెప్పగానే ఎలాంటి వివరాలు నమోదు చేసుకోకుండానే వెళ్లిపోవడం గమనార్హం.
దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటికొస్తాయని స్థానికులు మాట్లాడుకోవడం విశేషం.