ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోండి సారూ...!

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం బృందావనపురం గ్రామానికి చెందిన బొడ్డు ఆదిలక్ష్మి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్దం కావడంతో బొడ్డు ఆదిలక్ష్మి,ఇద్దరు కొడుకులు గోవర్ధన్,అనిల్,కోడలు మనీషా నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న విషయం తెలుసుకొని చలించిన తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అంజి యాదవ్ మంగళవారం గ్రామాన్ని సందర్శించి,బాధిత కుటుంబానికి రూ.5వేల ఆర్ధిక సహాయం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలక్ష్మిది ఎంతో పేద కుటుంబమని,

 Save Adilakshmi Family Who Lost Home By Fire Accident In Nadigudem Mandal, Adila-TeluguStop.com

రోజువారి పనికి వెళ్తేనే కుటుంబం నడవటం చాలా కష్టమని, ఇల్లు కాలిపోవడంతో జీవితం అగమ్యగోచరంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి ఆమెకు డబుల్ బెడ్ రూమ్ తో పాటు దళిత బంధు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ గోలి సునీత వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్,తెలంగాణ బీసీ సంఘం జిల్లా నాయకులు రాజశేఖర్ దేశినేని, కతిమాల వెంకన్న,తోకల మహేష్,గోలి ఎల్లయ్య, వెంకన్న,శేఖర్,లలిత, రామాంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube