సూర్యాపేట జిల్లా:2021 డిసెంబర్ నెలలో మేళ్లచెరువు మండల హెడ్ క్వార్టర్ లోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆ ప్రదేశాన్ని సందర్శించిన సమయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి విజ్ఞప్తి చేయగా,త్వరితగతిన టెండరు పనులను పూర్తి చేసి,పనులు మొదలు పెట్టినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ కమిటీ మెంబర్ యరగాని నాగన్న గౌడ్ తెలిపారు.ఈ రోజు ప్రారంభించిన పనుల పురోగతిని నాగన్న గౌడ్ బృందం సందర్శించి,పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు జడ్పిటిసి గోవింద రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,రైల్వే స్వర్క్స్ సూపర్వైజర్ గోలి శంబయ్య,మాజీ కౌన్సిలర్ చింతకాయల రాము,మేళ్లచెరువు ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.