సూర్యాపేట జిల్లా:పోలీసు పని విభాగాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తే సక్సెస్ వస్తుందని, పనులను విభజించి కేటాయించడంతో సిబ్బందిలో ఉత్తేజం,బాధ్యత పెరుగుతున్నాయని సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ నాగభూషణం అన్నారు.మంగళవారం ఆయన తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్దిరాల మండల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
స్టేషన్ నిర్వహణ,ఫైల్స్ అమలు, పోలీసు పని విభాగాల నిర్వహణ (పోలీస్ ఫంక్షనల్ వర్టికల్),పెట్రో కార్,బ్లూ కొట్స్ సిబ్బంది పని తీరుపై అరా తీశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నేరాల నమోదు,స్టేషన్ పరిధి,విలేజ్ రిజిస్టర్స్ ను పరిశీలించారు.
బ్లూ కోట్స్ సిబ్బంది సంఘటనలపై అత్యంత వేగంగా స్పందిస్తే బాధితులకు భరోసా, ధైర్యం వస్తుందన్నారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్ల పని తీరుపై నిత్యం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యం సాధించాలని,ఒకరికొకరు పోటీ తత్వంతో టీమ్ వర్క్ చేయాలని కోరారు.స్టేషన్ లో పని చేసే సిబ్బంది యొక్క సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని,సమస్యలు వస్తే అధికారుల దృష్టి తెచ్చి సహాయం పొందాలని అన్నారు.
పోలీసు స్టేషన్ విధులు,సిబ్బంది పని తీరును,మండల పరిధి,నేరాల తీరుతెన్నులను మద్దిరాల ఎస్ఐ వెంకన్న వివరించారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.