సూర్యాపేట జిల్లా:మోతె మండలం విభలాపురం గ్రామంలో శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేత ప్రారంభించే డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సిపిఎం మోతె మండల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలు అడ్డుకున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే రాకపోవడంతో పేదలు అక్కడే ధర్నాకు దిగడంతో వారిని వారించే క్రమంలో మోతె ఎస్ఐ మహేష్ సహనం కోల్పోయి సిపిఎం నేత మట్టిపెళ్ళి సైదులుపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పేదలు, సిపిఎం నాయకుడిపై దాడి చేసిన ఎస్ఐ మహేష్ ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా మట్టిపెళ్లి సైదులు మాట్లాడుతూ అధికారులు సర్వే చేసి తయారు చేసిన మొదటి లిస్టును మయం చేసి, అధికార పార్టీ నేతలు అనర్హులతో కూడిన రెండవ లిస్టు ఎంపిక చేసి,రాత్రికిరాత్రే వారిని గృహ ప్రవేశాలు చేయిచి, శుక్రవారం ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవ చేసేందుకు ఏర్పాట్లు చేశారని ఆరోపించారు.
అర్హత లేని వారికి,అధికార పార్టీకి చెందిన వారికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు ఎందుకు సహనం కోల్పోయి దాడులు చేస్తున్నారో అర్దం కావడం లేదన్నారు.కారణంగా తనపై దాడి చేసిన ఎస్ఐ మహేష్ పై శాఖా పరమైన చర్యలు తీసుకొని,సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు,కార్యకర్తలు, అర్హులైన పేద ప్రజలు పాల్గొన్నారు.