క్రైస్తవుల పట్ల ప్రభుత్వ చిన్నచూపు

సూర్యాపేట జిల్లా:ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే పండుగల్లో ఈస్టర్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఈ పండుగ రోజు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంతో విచారకరమని కోదాడ నియోజకవర్గ క్రైస్తవ నాయకులు బి.

 Government Contempt For Christians-TeluguStop.com

ఉదయ్ కుమార్ అన్నారు.ఆదివారం కోదాడలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

సర్వమానవాళి పాపపరిహారార్ధం యేసుక్రీస్తు మరణించారని,ముందుగానే చెప్పిన విధంగా మూడవరోజు పునరుథ్థానుడైనాడని,మరణించిన రోజును శుభ శుక్రవారంగా ఉపవాసాలాతో ప్రార్ధనలు నిర్వహిస్తారని,మూడవ రోజైన ఆదివారం ఈస్టర్ పండుగగా జరుపుకుంటారని తెలిపారు.ప్రపంచమంతా సంతోషించే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని,ప్రభుత్వ ఆధీనంలోని కార్యాలయాలకు,పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం డిగ్రీ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించడం ఏమిటని,ఇది ప్రభుత్వం యొక్క గ్రుడ్డితనానికి నిదర్శనమని పరీక్షలకు హాజరైనవారు, పలు క్రైస్తవ సంఘాలు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube